Homeక్రీడలువాంఖడేలో సెంచరీ చేయడం ఆనందంగా ఉంది: సంజు శాంసన్

వాంఖడేలో సెంచరీ చేయడం ఆనందంగా ఉంది: సంజు శాంసన్

- Advertisement -

క్రీడలు: ముంబయి ఇండియన్స్‌పై సెంచరీతో చెన్నై సూపర్ కింగ్స్‌కు తానెంత కీలక ప్లేయర్‌నో సంజుశాంసన్ మరోసారి నిరూపించాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో సంజూకిది రెండో శతకం కావడం గమనార్హం. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. చివరివరకూ ఓపికగా పరుగులు రాబట్టిన వైనం అభిమానులను ఆకట్టుకుంది. మ్యాచ్ ముగిశాక ఆయన మాట్లాడుతూ ఇది సీఎస్‌కే జట్టులో సీనియర్‌గా తన బాధ్యత అని సంజు చెప్పాడు. ‘వాంఖడే వేదికగా ముంబయిపై సెంచరీ చేయడం ఆనందంగా ఉంది. నాతోపాటు జట్టుకు ఇది స్పెషల్ మూమెంట్. పరిస్థితిని అంచనా వేసి ఆడేందుకు ప్రయత్నించాను. అంతకుమించి కొత్తగా ఏమీ చేయలేదు. వాంఖడే పిచ్ ఇంతకుముందు ఉన్నట్లు మామూలుగా లేదు. బంతి స్వింగ్ అవుతూ… కాస్త ఆగి వస్తోంది. ఓవైపు పరుగులు వస్తున్నా సరే వికెట్లు కోల్పోతూ ఉన్నాం. దీంతో నేను చివరివరకూ క్రీజ్‌లో ఉండటం ముఖ్యమని భావించాను. మనం ఏం చేయాలనేది గేమ్ ఎప్పటికప్ప్పుడు చెబుతూనే ఉంటుంది. అంతేకానీ, అలా ఆడాలి… ఇలా ఆడాలి అని ముందే ఒక మైండ్‌సెట్‌తో రాకూడదు. సీనియర్‌గా మ్యాచ్ పరిస్థితి, జట్టు అవసరాన్ని అర్థం చేసుకోవడం నా బాధ్యత. ఆ విషయాన్ని అనుభవం మీద తెలుసుకుంటున్నా. వాంఖడేలోనూ మాకు మంచి మద్దతు దక్కింది. నేను తొలిసారి యెల్లో జెర్సీ వేసుకొని బరిలోకి దిగా. సీఎస్‌కేకు ఆడటం గర్వంగా ఫీలవుతున్నా’ అని సంజు అన్నాడు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు