Tuesday, January 7, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఘనంగా వీరబాల దివస్

ఘనంగా వీరబాల దివస్

విశాలాంధ్ర -ధర్మవరం; పట్టణంలోని సంజయ్ నగర్ లో బి.ఎస్.ఆర్ మునిసిపల్ హైస్కూల్‌లో వీర్ బల్ దివస్ సందర్భంగా బీజేవైఎం యువమోర్చ ఆధ్వర్యంలో వీరబాల దివస్ కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథిగా మంత్రి నియోజకవర్గ ఇన్‌చార్జ్ హరీష్ బాబు పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సిక్కుల పదవ గురువు గురు గోవింద్ సింగ్ ,ఆయన కుటుంబం దేశం, మతం, ధర్మం రక్షణ కోసం చేసిన త్యాగాలను ఈ సందర్భంగా ప్రత్యేకంగా గుర్తుచేశారు. తన ఇద్దరు చిన్న సాహిబ్జాదాలు (జొరావర్ సింగ్, ఫతే సింగ్) నిరంకుశ పాలకుడి ముందు తలవంచకుండా ధైర్యంగా పోరాడి అమరులైన ఘట్టాన్ని గుర్తు చేస్తూ, వారి శౌర్యాన్ని, త్యాగాన్ని కొనియాడారు.డిసెంబర్ 26న ఈ చిన్న వీర బాలకుల్ని స్మరించుకునే ప్రత్యేకమైన రోజు అని,ఈ సంవత్సరంలో, మొదటిసారిగా, వీరి అమరత్వాన్ని గౌరవిస్తూ భారతదేశంలోని ధైర్యవంతులైన బాలలను సత్కరించడం ప్రత్యేకతగా నిలిచింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా, సిక్కుల వీరోచిత గాథలను గుర్తు చేస్తూ సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రత్యేక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి అని తెలిపారు. ఇది భారతీయులందరికీ స్ఫూర్తిదాయకమై, సమాజంలో త్యాగం, ధైర్యం వంటి విలువలను నేటి తరానికి చేరువ చేసే ప్రయత్నంగా నిలిచింది అని తెలిపారు.సాహిబ్జాదాస్ వీరత్వం సిక్కు సమాజం మాత్రమే కాకుండా భారతదేశ ప్రజలందరికీ గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీసత్యసాయి జిల్లా కో కన్వీనర్ బిల్లు కుళ్లాయప్ప యాదవ్, హెడ్ మాస్టర్ రాంప్రసాద్, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు సాకే ఓబిలేసు, జింకా చంద్రశేఖర్, ఇన్చార్జి హెచ్ఎం ప్రకాష్,అప్పారా చెరువు వీరనారప్ప,బిల్లే శీను, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు