Sunday, December 7, 2025
Homeజిల్లాలుపశ్చిమ గోదావరిపరిసరాల శుభ్రతతో ఆరోగ్యవంతమైన జీవితం : ఎమ్మెల్యే ధర్మరాజు

పరిసరాల శుభ్రతతో ఆరోగ్యవంతమైన జీవితం : ఎమ్మెల్యే ధర్మరాజు

- Advertisement -

విశాలాంధ్ర – గణపవరం (పశ్చిమగోదావరి జిల్లా) : ప్రతి గ్రామంలో పరిసరాల శుభ్రంగా ఉంచుకోవాలని అప్పుడే ప్రతి మనిషి ఆరోగ్యవంతమైన జీవితం కలిగి ఎక్కువగా కాలం జీవించ వచ్చనని ఉంగుటూరు శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు అన్నారు. శనివారం గణపవరం గ్రామ పంచాయితీ ఆధ్వర్యంలో జరిగిన స్వచ్ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వ్యక్తిగత, సమాజ పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన కొరకు ర్యాలీ నిర్వహించి, మానవహారం, ప్రతిజ్ణ చేయడం జరిగింది. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మూరా అలంకారం తహసిల్దార్ వై కె వి అప్పారావు,ఎంపీడీవో ఆర్ బేబీ శ్రీలక్ష్మి, డిప్యుటీ ఎంపీడీవో పల్లి వెంకట సత్యనారాయణ, జనసేన మండల అధ్యక్షులు తోట శ్రీను, గణపవరం సొసైటీ చైర్ పర్సన్ కుసంపూడి సురేంద్ర కుమార్ రాజు, గ్రామ పంచాయతీ కార్యదర్శి దార్ల శివరామ ప్రసాద్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, ఇతర కూటమి నాయకులు, సచివాలయం సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు