Sunday, December 7, 2025
Homeజిల్లాలుఅనంతపురంగ్రంథాలయ వారోత్సవాలలో పుస్తక ప్రదర్శన

గ్రంథాలయ వారోత్సవాలలో పుస్తక ప్రదర్శన

- Advertisement -

విశాలాంధ్ర- ఉరవకొండ (అనంతపురం జిల్లా) : 58 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా ఉరవకొండ శాఖ గ్రంధాలయం నందు శనివారం పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రంథాలయ శాఖ అధికారి ప్రతాపరెడ్డి మాట్లాడుతూ చినిగిన చొక్కా అయినా తొడుక్కో – ఒక మంచి పుస్తకం కొనుక్కో అని ఒక మంచి మాట తో పుస్తకం విలువను పుస్తకం ఆవశ్యకతను గురించి విద్యార్థులకు తెలియజేశారు. పుస్తక ము ఒక మంచి నేస్తం అని పుస్తకాలను చదివే అలవాటు చిన్నప్పటినుంచే అలవర్చుకోవాలని , నేటి చరిత్ర భావితరాలకు అందించే ఒక అద్భుతమైన రూపమే పుస్తకం, అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానమనే జ్యోతిని మనలో వెలిగించి ముందుకు నడిపే సాధనమే పుస్తకమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ పుస్తక ప్రదర్శన లో స్వాతంత్య్ర సమరయోధులకు సంబంధించిన పుస్తకాలు, విజ్ఞానానికి, వినోదానికి సంబంధించిన పుస్తకాలు , ఆధ్యాత్మిక పుస్తకాలు, కవితలు- కథల పుస్తకాలు, ప్రదర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి పాఠశాల హెచ్ఎం శ్యామ్, ఉపాధ్యాయులు, స్కూల్ విద్యార్థిని విద్యార్థులు గ్రంథాలయ పాఠకులు ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు