Sunday, December 7, 2025
Homeజిల్లాలుఅన్నమయ్యక్రీడలతో ఉజ్వల భవిష్యత్తు : గ్రాండ్ మాస్టర్ సునీల్

క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు : గ్రాండ్ మాస్టర్ సునీల్

- Advertisement -

విశాలాంధ్ర -రాజంపేట: క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ద్రోణాచార్య మార్షల్ ఆర్ట్స్ అకాడమీ గ్రాండ్ మాస్టర్ బి.సునీల్ పేర్కొన్నారు. ద్రోణాచార్య మార్చల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో శనివారం జిఎంసి ప్రాంగణం నందు బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టర్ సునీల్ మాట్లాడుతూ బెల్ట్ గ్రేడింగ్ లో 19 మంది క్రీడాకారులు పాల్గొన్నారని, వారిలో కూరాకు వెంకట్ వినయ్ కుమార్ రెడ్ బెల్ట్ సాధించగా మిగిలిన 18 మంది వివిధ గ్రేడుల్లో అర్హత సాధించారని తెలిపారు. టైక్వాండో ఒలంపిక్ క్రీడ కావడం చేత విద్యార్థులకు ఉన్నత విద్య, పోటీ పరీక్షలు, ఉద్యోగాలలో క్రీడా కోటా కింద మెరుగైన అవకాశాలు లభిస్తాయని తెలిపారు. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ప్రోత్సహించి క్రీడల్లో రాణించే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో అకాడమీ ఉపాధ్యక్షులు బచోటి భాస్కర్, ప్రధాన కార్యదర్శి చౌడవరం నరసింహ, సంయుక్త కార్యదర్శి మందా శివయ్య, క్రీడాకారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు