Saturday, November 15, 2025
Homeజిల్లాలుఅన్నమయ్యతాగునీరు-సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం..

తాగునీరు-సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం..

- Advertisement -

విశాలాంధ్ర-తాడిపత్రి /పుట్లూరు: త్రాగు, సాగునీటీ సమస్యలకు శాశ్వత పరిష్కారం వైపు అడుగులు వేస్తున్నామని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలోని కందికాపుల గ్రామంలో 1.50 లక్షల రూపాయల వ్యయంతో జె.సి. నాగిరెడ్డి తాగునీటి పథకాన్ని ఎం.పీ. అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ పునఃప్రారంభించారు. అనంతరం చింతకుంట గ్రామంలో డ్రింకింగ్ వాటర్ ప్లాంట్, 5 లక్షల రూపాయల వ్యయంతో సి.సి. రోడ్లను ప్రారంభించారు. చింతకుంట గ్రామానికి చెందిన నాగేశ్వర్ రెడ్డి అనే రైతు మినీ గోకులం షెడ్ కు భూమి పూజ చేసారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన జెసి.నాగిరెడ్డి తాగునీటి పథకాన్ని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పరిష్కరించామని. ఈ పథకం ద్వారా కందికాపుల, చుట్టుపక్కల గ్రామాలకు తాగునీటి సమస్య పరిష్కారము అయిందన్నారు.అలాగే ఇచ్చిన మాట కంటే 10 రోజులు ముందుగా సుబ్బరాయసాగర్ కు సాగునీటి విడుదల చేసి రైతుల పంటలకు సాగునీటి సమస్య లేకుండా చేస్తామని. అలాగే వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో తుప్పుపట్టిపోయిన మిడ్ పెన్నారు యంత్రాల మరమ్మతులకు, కాలువల ఆధునీకరణకు ప్రతిపాదనలు పెట్టిన కొద్ది నెలలకే కూటమి ప్రభుత్వం 5.25 కోట్లు మంజూరు చేయడమైనదని. గండికోట పుట్లూరు లిఫ్ట్ ఇర్రిగేషన్ కు ప్రతిపాదనలు పంపినామని త్వరలో నిధులు విడుదల అవుతాయాని తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని నీటి ప్రాజెక్ట్ లకు, సాగునీటి పారుదలకు నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యా, ఐ.టి. శాఖల మంత్రి నారా లోకేష్, ఇర్రిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకి నియోజకవర్గ ప్రజలు, రైతులు తరపున ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శివరామయ్య, టిడిపి నాయకులు కులశేఖర్ రెడ్డి, గోవర్ధన్ రాజు, రామచంద్రారెడ్డి, సుబ్బారెడ్డి, చెన్నారెడ్డి, గోపాల్ రెడ్డి, ఓబులాపురం శ్రీనివాసులు నాయుడు, రవి, చంద్ర, నరేష్, రామాంజుల చౌదరి, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు