విశాలాంధ్ర-తాడిపత్రి: చెత్తను ఎక్కడపడితే అక్కడ పడవేయొద్దండని మునిసిపల్ చైర్మన్ జెసి. ప్రభాకర్ రెడ్డి ప్రజలకు సూచించారు. మంగళవారం పట్టణంలోని విజయనగర్ కాలనీలో మున్సిపల్ చైర్మన్ జెసి. ప్రభాకర్ రెడ్డి పర్యటిస్తూ ఉండగా విజయనగర్ కాలనీలోని రాముల గుడి ఎదురుగా రోడ్డు పక్కలో చెత్త ఉండడం జెసి. ప్రభాకర్ రెడ్డి గమనించాడు. దీంతో జెసి. ప్రభాకర్ రెడ్డి చీపురు చేత పట్టుకుని చెత్తను ఉడ్చాడు. ఈ సందర్భంగా జెసి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీ చెత్త వాహనాలు వచ్చినప్పుడు చెత్త వెయ్యాలని, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకూడదన్నారు. ఎక్కడపడితే అక్కడ చెత్త వేయడం వల్ల ప్రజలు తమ ఆరోగ్యాలు పాడై, వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, కావున ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలలో పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. ముఖ్యంగా ఎక్కడపడితే అక్కడ చెత్త వేసిన వారిపై మున్సిపాలిటీ అధికారులు పెనాల్టీ వేస్తారని ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆ కాలనీ ప్రజలు పాల్గొన్నారు.


