Sunday, November 16, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయినిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా టపాసులు విక్రయించినా చర్యలు తప్పవు...

నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా టపాసులు విక్రయించినా చర్యలు తప్పవు…

- Advertisement -

నిర్వాహకులు ప్రభుత్వం సూచించిన నియమనిబంధనలు, జాగ్రత్తలు పాటించాలి.

విశాలాంధ్ర పుట్టపర్తి:- టపాసుల విక్రయదారులు నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పి సతీష్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ రానున్న దీపావళి సందర్భంగా అనుమతులు పొందిన ప్రతి ఒక్కరూ టపాసులు నిల్వ ఉంచే ప్రాంతాలతో పాటు అమ్మకాలు చేపట్టే దగ్గర ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలు తప్పక పాటించాలన్నారు.టపాసులు విక్రయించే ప్రాంతాలలో తీసుకోవలసిన జాగ్రత్తలకు పై నియ నిబంధనలను తెలియజేశారు.ప్రమాదాలకు తావులేకుండా, సరైన భద్రతా ప్రమాణాలు, సూచనలు పాటిస్తూ షాప్ లు ఏర్పాటు చేసుకొని టపాసులను విక్రయించాలని విక్రయదారులకు, సంబందిత అదికారులకు ఆదేశించారు.దీపావళి పండుగ నేపథ్యంలో ఫైర్ క్రాకర్స్ షాపు నిర్వహకులు ఎక్కువగా క్రాకర్స్ నిల్వలు ఉంచిన, వాటిపై ఫైర్ సేఫ్టీ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారా లేదా అనే విషయమై పోలీసు అదికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడము జరుగుతుందన్నారు.దీపావళి టపాకాయలు విక్రయదారులు జనసంచారం ఉన్న ప్రదేశాలలో, ప్రజల నివాస ప్రాంతాలలో టపాకాయలు విక్రయించరాదని, ప్రభుత్వ అధికారులు నిర్దేశించిన ప్రదేశాలలో మాత్రమే ప్రభుత్వ నిబందల ప్రకారం దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.బాణసంచా విక్రయదారులు చట్టం సూచించిన నిబంధనలు, జాగ్రత్తలు పాటించాలి.నీరు, ఇసుక, తదితర అగ్నిమాపక సామాగ్రిని తప్పనిసరిగా టపాసుల విక్రయ దుకాణాల్లో సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.చిన్న పిల్లలను తపాకాల విక్రయాల పనుల్లో ఉంచుకోరాదన్నారు.ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ తప్పనిసరిగా పాటించాలన్నారు.ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే తీసుకోవలసిన చర్యలపై అవగాహన కలిగి ఉండాలన్నారు.పోలీసు నియమ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఎవరైనా అక్రమంగా టపాసులు విక్రయిస్తున్నా వెంటనే డయల్ 112 లేదా సంబంధిత పోలీసు స్టేషన్ కు సమాచారం చేరవేసిన వారి వివరాలు గోప్యంగా సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు