విశాలాంధ్ర – నంబులపూలకుంట :మండల పరిధిలోని బత్తినిగారిపల్లి గ్రామ సమీపంలోని పొలాల్లో పేకాట ఆడుతున్న ఐదుగురు జూదరులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఎస్సై వలి బాషా తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం, రహస్య సమాచారం ఆధారంగా పోలీసులు దాడి చేసి, పేక ముక్కలు, రూ 3005 నగదు స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ పేకాట, మద్యం, గంజాయి వంటి వ్యసనాలు గ్రామీణ సమాజంలో విస్తరిస్తూ కుటుంబాలనే దెబ్బతీస్తున్నాయని, రోజువారీ కూలీలు, చిన్న వ్యాపారులు ఈ మాయాజాలంలో పడిపోవడం వల్ల అప్పులు, కుటుంబ కలహాలు, ఆత్మహత్యలు వంటి దారుణాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. . పోలీసులు తరచూ గ్రామాల్లోకి వెళ్లి అవగాహన కల్పిస్తున్న పేకాట సెంటర్లు రూపం మార్చుకుని మళ్లీ వెలుస్తుండటం ఆందోళనకర విషయం అని పేర్కొన్నారు. అలాంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు.
5 మంది జూదరులు అరెస్ట్…
- Advertisement -
RELATED ARTICLES


