Sunday, November 16, 2025
Homeజిల్లాలుఅనంతపురంట్రాన్స్ ఫార్మర్ల కోసం ఎదురుచూపులు....

ట్రాన్స్ ఫార్మర్ల కోసం ఎదురుచూపులు….

- Advertisement -

2500 మంది రైతులకు అందని పరికరాలు

12నెలలుగా కాలయాపన…. సిబ్బంది కొరతతో సతమతం

విశాలాంధ్ర , కళ్యాణదుర్గం వ్యవసాయం భారంగా మారిన నేపథ్యంలో అన్నదాతలు అడుగడుగునా ఇబ్బందులు పడుతున్నారు. వర్షాధార పంటలు చేతికి అందక భూగర్భ జలం కోసం అన్వేషిస్తూ రైతులు బోరుబావులు తవ్వుకుంటున్నారు. కళ్యాణదుర్గం సబ్ డివిజన్ పరిధిలో రాయదుర్గం, ఉరవకొండ, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 2500 మంది రైతులు బోరు బావులు తవ్వుకొని విద్యుత్ కనెక్షన్ల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. పెట్టుబడి పెట్టి బోరు బావులు తవ్వుకొని వ్యవసాయం చేయడానికి సన్నద్ధమవుతున్న నేపథ్యంలో ట్రాన్స్ఫార్మర్లు అందకపోవడంతో నానా అగచాట్లు పడుతున్నారు. సమీపంలోని రైతుల దగ్గర కనెక్షన్ తీసుకుని పంటలు పండించుకుందామంటే లో వోల్టేజ్ సమస్యతో సతమతమవుతున్నారు. దీనికి తోడు ట్రాన్స్కో సిబ్బంది అరకొరగా ఉండడంతో సమస్య ఎవరికీ చెప్పుకోవాలో అర్థం కావడంలేదని అన్నదాతలు వాపోతున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఏడుగురు ఏఈలు ఉండాల్సిన చోట నలుగురు మాత్రమే ఉన్నారు. మూడు ఖాళీలు ఉండటంతో ఇంచార్జ్ పాలన కొనసాగుతుంది. సెట్టూరు, కంబదూరు, కుందుర్పిమండలాల్లో రైతులు తమ సమస్యలు చెప్పుకోవడానికి ఏఈలు అందుబాటులో ఉండడం లేదు. సీనియార్టీ ప్రకారం ట్రాన్స్ఫార్మర్లు అందిస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్ వరకు డీడీలు చెల్లించిన వారికి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పరికరాలు అందిస్తున్నారు. సుమారు 12 నెలలుగా ట్రాన్స్ఫార్మర్లు సరఫరా లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కళ్యాణదుర్గం డివిజన్లో 2500 ట్రాన్స్ఫార్మర్లు అవసరం ఉందని ఈ విషయమై జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందించినట్లు డి.ఈ. రాజశేఖర్ తెలిపారు. డీడీలు చెల్లించిన రైతులు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమేనని అయితే పరికరాలు సరఫరా కాకపోవడంతో రైతులకు అందడం లేదని ఆయన వివరించారు. సిబ్బంది కొరత కూడా ఉందని ఉన్నతాధికారులకు సమస్యను వివరించామని ఆయన తెలిపారు. వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కళ్యాణదుర్గం డివిజన్ రైతులకు ప్రభుత్వం నుండి ట్రాన్స్ఫార్మర్లు సకాలంలో అందించి ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు