Sunday, November 16, 2025
Homeజిల్లాలుఅనంతపురంరెండేళ్లుగా ఆర్టీసీ బస్టాండు ద్వారం మూత.. రాకపోకలకు ఇబ్బందులు

రెండేళ్లుగా ఆర్టీసీ బస్టాండు ద్వారం మూత.. రాకపోకలకు ఇబ్బందులు

- Advertisement -

విశాలాంధ్ర , కళ్యాణదుర్గం.. ఆర్టీసీ బస్టాండుకు ఇరువైపులా ద్వారాలు ఉంటే బస్సులు లోపలికి రావడానికి, వెలుపలికి వెళ్లడానికి సులువుగా ఉంటుంది. ఈ చిన్న ట్రిక్ ను ఆర్టిసి అధికారులు రెండేళ్లుగా మర్చిపోయారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కళ్యాణదుర్గం పర్యటన వచ్చిన నేపథ్యంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ కు ధర్మవరం రోడ్డు వైపు ప్రధాన ద్వారాన్ని మూతవేశారు. అప్పట్లో భద్రత దృష్ట్యా ఇలా చేశారు. అయితే ముఖ్యమంత్రి పర్యటన తర్వాత ద్వారాన్ని తెరవాల్సి ఉంది. డిపో మేనేజర్ కానీ , ఇతర సిబ్బంది గాని మూతపడిన ద్వారాన్ని తెరవడానికి తీరిక లేకుండా పోయింది. బస్సులు లోపలికి రావడానికి వెలపలికి వెళ్లడానికి ఒకే ద్వారా అనుసరిస్తుండడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ధర్మవరం రోడ్డు వైపు ఉన్న ద్వారాన్ని పూర్తిస్థాయిలో తెరిచి బస్సుల రాకపోకులకు మార్గాన్ని సుగమం చేయాలని ఆర్టీసీ డ్రైవర్లు, ప్రయాణికులు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు