Sunday, November 16, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిక్రీడా పోటీలలో మెరిసిన యశోద పాఠశాల విద్యార్థులు.. ప్రిన్సిపాల్ అనూప్

క్రీడా పోటీలలో మెరిసిన యశోద పాఠశాల విద్యార్థులు.. ప్రిన్సిపాల్ అనూప్

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం : క్రీడా పోటీలలో భాగంగా హ్యాండ్ బాల్ పోటీల్లో యశోద పాఠశాల విద్యార్థులు మంచి ప్రతిభను ఘనపరచడం జరిగిందని ప్రిన్సిపాల్ అను ప్, డైరెక్టర్లు రవీంద్ర పృధ్విరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 8 నుండి 13వ తేదీలలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఆర్ట్స్ కళాశాలలో హ్యాండ్ బాల్ బాలికల విభాగం అండర్ -14, అండర్ 17, అండర్ 19 జరిగిన పోటీలలో పాల్గొని అనంతపురం జిల్లా జట్టుకు ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. ఎంపికైన విద్యార్థులలో అండర్ 14 గిరి చరణ్ 8వ తరగతి, మోక్షిత రాజ నాయక్ ఎనిమిదో తరగతి, అండర్ 17లో తేజ సాయి రెడ్డి 9వ తరగతి, తన్మయశ్రీ 9వ తరగతి, అండర్ 19 లో హరిని తొమ్మిదవ తరగతి, జనప్రియ ఎనిమిదవ తరగతి ఎంపిక కావడం జరిగిందన్నారు. వీరందరినీ డైరెక్టర్లు రవీంద్ర, పృధ్వీరాజ్, ప్రిన్సిపాల్ అనూప్, వ్యాయామ ఉపాధ్యాయులు, పాఠశాల ఉపాధ్యాయులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు