దీక్షలను ప్రారంభించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి జగదీష్,
విశాలాంధ్ర గుంతకల్లు… గుంతకల్లు పట్టణము అభివృద్ధి పట్ల ప్రభుత్వాల వివక్షతకు నిరసనగా సిపిఐ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట సామూహిక దీక్షలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీ జగదీష్ ప్రారంభించారు. ఈ దీక్షలకు మున్సిపల్ చైర్మన్ భవాని, మున్సిపల్ మాజీ చైర్మన్ రామలింగ, అడ్వకేట్ చెన్నకేశవ సంఘీభావం తెలిపారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్ మాట్లాడుతూ గుంతకల్లు పట్టణము ఎలాంటి అభివృద్ధికి నోచుకోవడం లేదనీ మండిపడ్డారు. స్థానిక ఎంఎల్ఏలు ఏ పార్టీకి చెందినవారైనప్పటికీ వారు ప్రజల కోసం అడుగుతున్న ఏ అభివృద్ధి పనినీ చేయడం లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదనీ, నిధులు ఇవ్వడం లేదనీ గుంతకల్లు పట్టణం పట్ల సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారనీ,ఎద్దేవ చేశారు. కసాపురం పుణ్యక్షేత్రానికి రైల్వే వంతెన వద్ద ఇరుకైన రోడ్డుతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారనీ ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుందన్నారు . ఈ రైలు వంతెనపై ఫ్లై ఓవర్ను నిర్మించాలని అన్ని రాజకీయ పార్టీలు, గతంలో ఎన్నికైన ఎమ్మెల్యేలను ఎన్నిసార్లు అడిగిన, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవించినా ఇంత వరకూ సమస్య పరిష్కారం కాలేదన్నారు. రైల్వే స్టేషన్ ను కొత్తగా నిర్మించినప్పటికీ దానికి వెళ్లే దారి కోసం రైల్వే అధికారులు ఒక ఫ్లై ఓవర్ను నిర్మించలేదనీ పట్టణం నుండి రైల్వే స్టేషను వెళ్లడానికి ఎస్బీఐ బ్యాంకు ముందు ఒకే ఒక దారి మాత్రమే ఉంది. ధర్మవరం గేటు కూడా యూ ఆకారంలో నిర్మిస్తున్నారు. ఇక్కడ కూడా ప్లై ఓవర్ వంతెన లేదన్నారు.బళ్లారి రోడ్డులో ఉన్న రైల్వే గేటును కూడా ఇటీవల ఎక్కువసార్లు మూసి వేస్తు ట్రాఫిక్ పెరిగినందువల్ల బళ్లారి, ఉరవకొండ, ఆలూరు వైపు వెళ్లే, వచ్చే వాహనాలు గేటుకు రెండు వైపులా ఎక్కువ సంఖ్యలో బారులుతీరి నిలిచిపోతున్నాయినీ, అక్కడ కూడా రోడ్లు మోకాళ్ళ లోతు గుంతలు పడడంతో ఆర్ అండ్ బి అధికారులు పట్టించుకోని పాపాన పోలేదని అన్నారు.ఇక్కడ కూడా ఒక ప్లై ఓవర్ వంతెనను నిర్మించాల్సి ఉందినీ అన్నారు. గుత్తి-గుంతకల్లు జాతీయ రహదారి పనులను అర్ధాంతరంగా నిలిపివేసి ఈ రోడ్డు 2018 సంవత్సరానికి పూర్తి కావాల్సి ఉంది. కానీ ఇంత వరకూ పనులు పూర్తికాలేదనీ దుయ్యబట్టారు. గుత్తి-గుంతకల్లు రహదారి చాలా అధ్వాన్నంగా ఉంది. అందరికన్నా స్థానిక ఎంఎల్ గారే ఎక్కువసార్లు గుత్తి, పామిడి పట్టణాలకు ఈ రోడ్డు గుండానే వెళ్లి వస్తూ ఉంటారు. ఎంఎల్ ఈ రోడ్డు నిర్మాణం పట్ల ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థం కావడంలేదునీ అన్నారు. ఇక ఎంపీ పార్లమెంటులో ఈ రోడ్డు గురించి రెండుసార్లు మాట్లాడారు. అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదునీ అన్నారు. ఆలూరు, ఉరవకొండ రోడ్లతోపాటు మునిసిపాలిటీ పరిధిలోనూ రోడ్లు చాలా అధ్వానంగా గుంతలు పడి ఉన్నాయినీ ఉర్దూ కళాశాల కోసం ఎస్ జేపీ హైస్కూలు పక్కన భవనాలను కొత్తగా నిర్మించి, వాటిని వినియోగించకపోవడం వల్ల ఆ స్కూలు భవనాలు శిథిలావస్థకు చేరాయినీ మండిపడ్డారు. ప్లై ఓవర్ వంతెనల విషయానికి వస్తే అనంతపురం, తాడిపత్రి, రాయదుర్గం, ధర్మవరం, తదితర పట్టణాలలో ఫ్లై ఓవర్ బ్రిడ్జిలను నిర్మించినారు. గుంతకల్లులో ఒకటైనా ప్లై ఓవర్ బ్రిడ్జి ఉందా? అని అన్నారు ఈ నమస్యల వరిష్కారం కోసం ఈ రోజు నుంచి మునిసిపల్ ఆఫీసు వద్ద సీపీఐ సామూహిక దీక్షలను చేపట్టిందన్నారు రాజకీయాలకు అతీతంగా ఈ ఆందోళనకు పట్టణ ప్రజలు మద్దతుఇవ్వవలసినదిగా కోరుతున్నామునీ అన్నారు. ఈ కార్యక్రమం లో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బి గోవిందు ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రాజేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు


