విశాలాంధ్ర ధర్మవరం: ఆంధ్ర ప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) ధర్మవరం పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్థానిక శ్రీ గణేష్ మున్సిపల్ ఉన్నత పాఠశాల, సుందరయ్య నగర్ నందు డీఎస్సీ – 2025 ద్వారా ఎంపికై, ధర్మవరం మున్సిపాలిటీ నందు నియమితులైన నూతన ఉపాధ్యాయులకు స్వాగతం పలికి, అనంతరం యుటిఎఫ్ పక్షాన నూతన ఉపాధ్యాయులకు సేవా పుస్తకాలు (సర్వే రిజిస్టర్లు) , యుటిఎఫ్ బ్యాగులను రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రా రెడ్డి, జిల్లా కార్యదర్శి రామకృష్ణ నాయక్ బహూకరించారు. ఈ సందర్భంగా జయచంద్ర రెడ్డి మాట్లాడుతూ లక్ష్యాలతో రాష్ట్రంలో ఒక లక్షకు పైగా ఉపాధ్యాయ సభ్యత్వం కలిగిన అతిపెద్ద ఉపాధ్యాయ సంఘం యుటిఎఫ్ అని, విద్యా, ఉపాధ్యాయుల సమస్యల పట్ల రాజీలేని పోరాటాలు కొనసాగిస్తున్న యుటిఎఫ్ సంఘంలో నూతన ఉపాధ్యాయులు సభ్యులుగా చేరి సంఘాన్ని బలపరచాలని కోరారు. అలాగే మున్సిపాలిటీ ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని, డీఎస్సీ ద్వారా భర్తీ కాకుండా మిగిలి ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, అవసరమైతే వర్క్ అడ్జస్ట్మెంట్ ద్వారా అయినా ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలలకు ఉపాధ్యాయులను కేటాయించాలని, అర్బన్ ఎంఈఓ పోస్టులను కొత్తగా ఏర్పాటు చేసి వాటిని మున్సిపల్ ప్రధానోపాధ్యాయుల ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన పెండింగ్ డి ఎ లను విడుదల చేయాలని, పిఆర్సి కమిటీ వేసి, మధ్యంతర భృతి వెంటనే 30 శాతం ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ ధర్మవరం పట్టణ శాఖ నాయకులు లక్ష్మయ్య, డా. రామకృష్ణ, రాంప్రసాద్, సాయి గణేష్, రామాంజనేయులు ధర్మవరం మండలం అధ్యక్షులు ఆంజనేయులు, నూతన ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
యుటిఎఫ్ ఆధ్వర్యంలో డీఎస్సీ 2025 ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు సర్వీస్ రిజిస్టర్ ల బహుకరణ
- Advertisement -
RELATED ARTICLES


