Homeజిల్లాలుతూర్పు గోదావరిదాతృత్వాన్ని చాటుకున్న గొల్లపల్లి మాష్టారు

దాతృత్వాన్ని చాటుకున్న గొల్లపల్లి మాష్టారు

- Advertisement -

విశాలాంధ్ర – కడియం : కడియం మండలం, మురమండ గ్రామానికి చెందిన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత గొల్లపల్లి సత్యనారాయణ, రత్నం దంపతులు పిచ్చుక కోటయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసుకుని ఎంపిసి లో 913/1000 మార్కులు సాధించిన గాదంశెట్టి వర్షిత వీరవేణి కి ఐదువేల రూపాయలను అందజేశారు. మాధవరాయుడుపాలెం గ్రామానికి చెందిన వర్షిత తండ్రి శ్రీనివాస్ ఇటీవల అనారోగ్య కారణం చేత మరణించారనే సంగతి తెలుసుకుని, తన పుట్టినరోజు సందర్భంగా ఈ నగదు బహుమతిని వర్షిత కు అందించారు. అంతేకాకుండా, జూన్ 5 వ తేదీన కడియపులంక పల్ల వెంకన్న చారిటబుల్ ట్రస్ట్ వారి ద్వారా పదివేల రూపాయలు అందజేయనున్నారని, భవిష్యత్ లో వర్షిత డిగ్రీ చదువుల కోసం దాతల సహకారాన్ని తీసుకుని చదివించే ఏర్పాట్లు చేస్తున్నట్లు సత్యనారాయణ తెలియజేశారు. గతంలో అనేక మంది విద్యార్థులకు ఆర్థిక సహాయం చేసి వారి ఉన్నత చదువుకు సహకరించిన మాస్టారును పలువురు అభినందించగా, తన మనుమరాలు చదువు నిమిత్తం అన్ని విధాల సహాయం చేస్తున్న మాస్టారు దంపతులకు చాపా శివయ్య కృతజ్ఞతలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు