Homeఆంధ్రప్రదేశ్హైకోర్టును ఆశ్రయించిన హీరో నాగార్జున

హైకోర్టును ఆశ్రయించిన హీరో నాగార్జున

- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీ హైకోర్టును టాలీవుడ్ ప్రముఖ నటుడు, హీరో అక్కినేని నాగార్జున ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా.. తన ఫోటోతోపాటు తన పేరును వాడుకోకుండ నిషేధం విధించాలంటూ ఢిల్లీ హైకోర్టులో హీరో నాగార్జున పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను గురువారం జస్టిస్ తేజస్ కారియా విచారించారు. పర్సనాల్టీ రైట్స్ కోసం గతంలో బాలీవుడ్ హీరోహీరోయిన్లు అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్, అనిల్ కపూర్ తదితరులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సినీనటుల అనుమతి లేకుండా వారి పేరును వాడుకోవద్దంటూ గతంలో ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హీరో నాగార్జున ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు