Homeఅంతర్జాతీయంఐరాసలో నాకు అవమానం జరిగింది.. సీక్రెట్‌ సర్వీస్‌ దర్యాప్తు చేపట్టాలి : ట్రంప్‌

ఐరాసలో నాకు అవమానం జరిగింది.. సీక్రెట్‌ సర్వీస్‌ దర్యాప్తు చేపట్టాలి : ట్రంప్‌

- Advertisement -

ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కు చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. ఐక్యరాజ్య సమితికి మంగళవారం సతీమణి మెలానియాతో కలిసి వెళ్లిన ఆయన.. జనరల్‌ అసెంబ్లీ 80వ సమావేశంలో ప్రసంగించారు. అయితే, జనరల్‌ అసెంబ్లీలో ప్రసంగించేందుకు వెళ్లే క్రమంలో తనకు ఎదురైన చేదు అనుభవాలపై ట్రంప్‌ తాజాగా స్పందించారు. ఐరాసలో జరిగిన వరుస సాంకేతిక ప్రమాదాలు ఉద్దేశపూర్వక విధ్వంసక చర్యలని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయా ఘటనలపై సీక్రెట్‌ సర్వీస్‌ దర్యాప్తు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు