Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఘనంగా హిందీ దివస్ వేడుకలు

ఘనంగా హిందీ దివస్ వేడుకలు

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని రుషి విద్యాలయంలో హిందీ దివస్ వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు పాఠశాల డీన్. భాస్కర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా డీన్ భాస్కర్ రెడ్డి, హెడ్మాస్టర్ కరణ్ స్వరూప సింగ్, సిపిఓ రవీంద్ర వారు మాట్లాడుతూ సెల్ ఫోన్ దుష్ ప్రభావం మీద ఒక ప్రత్యేకమైన నాటకాన్ని ప్రదర్శించడం జరిగిందని తెలిపారు. భారత దేశంలో భిన్నత్వంలో ఏకత్వం అన్నదానికి మన భారతదేశం నిదర్శనం అని తెలిపారు. బాల్యం నుండే జాతీయ భావాలను విద్యార్థులు అలవర్చుకోవాలని తెలిపారు. హిందీ నేర్చుకోవడం వలన భారతదేశంలో ఎక్కడైనా బ్రతకగలరని తెలిపారు భారతీయులను ఏకం చేసే సాధనం ఒక హిందీ భాష అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హింది అధ్యాపకురాలు పూజిత ఏవో రంగారెడ్డి వైస్ హెడ్మాస్టర్ కళ్యాణి ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు