విశాలాంధ్ర ధర్మవరం;! శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన ప్రముఖ గాయని, గిన్నిస్ బుక్ హోల్డర్ అయిన సోమిశెట్టి సరలకు విజయవాడలో జరిగిన అఖిలభారత పద్మశాలి సంఘం వార్షిక , జాతీయ మహాసభలో జానపదం, స్వాతంత్ర సమరవీరుల వెలికితీతలో జాతీయస్థాయిలో పరిశోధన ఆత్మకు రచయితగా, సరళ సమాజానికి చేస్తున్న కృషిని గుర్తిస్తూ వారిని సంఘ అధ్యక్షులు నాగేశ్వరరావు, మహిళా నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ తన జీవితాన్ని జానపద కళా రంగానికి అంకితం చేస్తూ జానపద అభివృద్ధికి భవిష్యత్తులో మరింత కృషి చేస్తానని తెలిపారు. ఇక్కడకు విచ్చేసిన వివిధ రాష్ట్రాలకు చెందిన పద్మశాలి సంఘ ప్రతినిధులు సరళ పాడిన జానపద గీతాలు సమూహితులై హర్షమును వ్యక్తం చేశారు.
నా జీవితం జానపద కళ రంగానికి అంకితం.. సోమిశెట్టి సరళ
- Advertisement -
RELATED ARTICLES


