Homeజిల్లాలుశ్రీ సత్యసాయిగ్రంథాలయంలో నూతన కమిటీ ఏర్పాటు..

గ్రంథాలయంలో నూతన కమిటీ ఏర్పాటు..

- Advertisement -

గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో గల ప్రధాన గ్రంథాలయంలో నూతన కమిటీని ఏర్పాటు చేసినట్టు గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రంథాలయ అభివృద్ధి కమిటీ ఉత్తర్వులు మేరకు రమ కార్యదర్శి జిల్లా అధికారిని ఆదేశాల మేరకు ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ఈ కమిటీలో అధ్యక్షులుగా చింతపులుసు పెద్దన్న, ఉపాధ్యక్షులుగా మేడా రవి, ప్రధాన కార్యదర్శిగా ఎంఈఓ గోపాల్ నాయక్, సహాయ కార్యదర్శిగా సుమన్, కమిటీ సభ్యులుగా బి.ఆర్ రంగనాథ్, సుకుమార్, నాగరాజు ,తిరుపాలు ,ప్రదీప్, శ్రీనివాసరెడ్డి, సురేంద్ర, ముకుంద, కమిటీ కన్వీనర్ గా అంజలి సౌభాగ్యవతి, ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం కమిటీ అధ్యక్షులు ఉపాధ్యక్షులను ఘనంగా సన్మానించారు. తదుపరి గ్రంథాలయంలో గాడిచెర్ల హరి సర్వోత్తమ 143వ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గ్రంథాలయ అభివృద్ధికి వారు చేసిన సేవలను కొనియాడారు. తదుపరి విద్యార్థులతో పుస్తక పఠనమును నిర్వహించారు. అనంతరం చదువు అంటే నాకిష్టం అని కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ సిబ్బంది రాము రమణా నాయక్, పాఠకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు