Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యం.. రోటరీ క్లబ్

పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యం.. రోటరీ క్లబ్

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం; పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యము అని రోటరీ క్లబ్ అధ్యక్షులు నాగభూషణ, కార్యదర్శి విజయభాస్కర్, క్యాంపు చైర్మన్ రిటైర్డ్ డాక్టర్ సంకారపు నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణములో (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ శిబిరం రోటరీ క్లబ్, శంకరా కంటి ఆసుపత్రి బెంగళూరు, జిల్లా అందత్వ నివారణ సంస్థ శ్రీ సత్య సాయి జిల్లా వారి సహకారంతో నిర్వహించడం జరిగిందని తెలిపారు. అనంతరం కంటి వైద్య చికిత్సలకు వచ్చిన వారికి, ఆపరేషన్ కి ఎంపికైన వారందరికీ కూడా కంటిపట్ల తీసుకోవలసిన జాగ్రత్త గూర్చి వివరించారు. కంటి నిపుణుల సలహాలతో కళ్ళలలో ఉచిత లెన్స్ కూడా అమర్చబడునని తెలిపారు. ఆపరేషన్ల కొరకు వెళ్లిన వారికి బెంగళూరులో భోజనము వసతి ఇతర సౌకర్యంతో పాటు అన్ని ఉచితముగా కల్పించబడునని తెలిపారు. ఉచితంగా అద్దాలు కూడా పంపిణీ చేయబడును నీ తెలిపారు. ఈ శిబిరంలో మొత్తం 135 మంది కంటి రోగులకు వైద్య చికిత్సలు అందించగా అందులో 85 మంది కంటి ఆపరేషన్లకు ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి శిబిర దాతలుగా రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షురాలు, ఇన్నర్ వీల్ క్లబ్ మాజీ అధ్యక్షులు సంకారపు జయ శ్రీ, రిటైర్డ్ అందత్వ నివారణ అధికారి, కంటి వైద్య నిపుణులు డాక్టర్ సంకారపు నరసింహులు వ్యవహరించడం పట్ల వారు కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా బెంగళూరు డాక్టర్ బ్రిడ్జి ద్వారా కంటి రోగులకు వైద్య చికిత్సలను అందించారు. తదుపరి శిబిర దాతలకు, కంటి డాక్టర్ను రోటరీ క్లబ్ వారు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో శివయ్య, సుదర్శన గుప్తా, సత్రశాల ప్రసన్నకుమార్, టి. రత్నశేఖర్ రెడ్డి, మనోహర్ గుప్తా, జయచంద్ర, రామకృష్ణ, శ్రీనివాసుల రెడ్డి, శంకరా కంటి ఆసుపత్రి పిఆర్ఓ శివప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు