- Advertisement -
నాగేంద్రమ్మకు ఏఐటీయూసీ రూ. 30 వేల ఆర్థిక సహాయం
విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) : ఇటీవల కాలంలో గుండెపోటుతో మృతి చెందిన గాలిమర్ల కంపెనీ సెక్యూరిటీ గార్డ్ చక్రాల శ్రీనివాసుల భార్య నాగేంద్రమ్మకు యూనియన్ తరపున రూ.30 వేల ఆర్థిక సహాయం అందజేశారు. మంగళవారం ఏఐటీయూసీ నాయకులు కృష్ణమూర్తి, వీరేష్ పరామర్శించి భరోసా ఇచ్చారు. శ్రీనివాసులు లేని లోటు యూనియన్‌కు తీరని లోటు అన్నారు.


