Wednesday, January 8, 2025
Homeజాతీయందేశంలో ఏడుకు చేరిన హెచ్‌ఎంపీవీ కేసులు

దేశంలో ఏడుకు చేరిన హెచ్‌ఎంపీవీ కేసులు

దేశంలో మరో రెండు హ్యూమన్‌ మెటా న్యూమో వైరస్‌ (హెచ్‌ఎంపీవీ) కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య ఏడుకు పెరిగింది. మంగళవారం నాగ్‌పూర్‌లో ఇద్దరికి ఈ వైరస్‌ సోకినట్టు గుర్తించారు. ఇంతవరకు బెంగళూరులో రెండు, సేలం, అహ్మదాబాద్‌, చెన్నైల్లో ఒక్కొక్క కేసు వంతున నమోదయింది. బాధితులంతా మూడు నెలల నుంచి 13 ఏళ్లలోపు ఉన్న పిల్లలే. ఇది కొత్త వైరస్‌ ఏమీ కాదని, 2001లోనే గుర్తించారని ఎయిమ్స్‌ మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా చెప్పారు. ఫ్లూ లక్షణాలతో ఉన్న జ్వరం వస్తుందని, దీనికి ఎలాంటి యాంటీ బయోటిక్స్‌ వాడాల్సిన పనిలేదని తెలిపారు. తగినన్ని నీళ్లు తాగాలని, పారాసిటమాల్‌ మాత్రలు, జ్వరం, వళ్లు నొప్పులు నివారించే మందులతో ఇది తగ్గుతుందని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు