Wednesday, December 4, 2024
Homeజిల్లాలుఅనంతపురంఇండ్ల పట్టాలను వెంటనే మంజూరు చేయాలి

ఇండ్ల పట్టాలను వెంటనే మంజూరు చేయాలి

ఆర్డీవో జి. కేశవ నాయుడు కు వినతి పత్రం అందజేసిన సిపిఐ నగర కార్యదర్శి ఎన్. శ్రీరాములు విశాలాంధ్ర అనంతపురం రూరల్ : ఉప్పరపల్లి పొలంలో సర్వేనెంబర్ 194-8 ఇండ్ల పట్టాలను వెంటనే మంజూరు చేయాలి ని ఆర్డీవో జి. కేశవ నాయుడు కు సిపిఐ నగర కార్యదర్శి ఎన్. శ్రీరాములు వినతి పత్రం అందజేశారు. సోమవారం స్థానిక ఆర్డిఓ కార్యాలయం ముందు వినపట్టాలని మంజూరు చేయాలని సిపిఐ నగర్ సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ నగర సహాయ కార్యదర్శి బి.రమణ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా నగర కార్యదర్శి ఎన్ శ్రీరాములు, ఏ ఐ వై ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి. సంతోష్ కుమార్, నగర్ సహాయ కార్యదర్శి అలిపిర పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర కార్యదర్శి ఎన్.శ్రీరాములు మాట్లాడుతూ…అనంతపురము రూరల్ ఉప్పరపల్లి పొలంలో స.నెం. 194-8 నందు దాదాపు 250 మంది గత కొన్ని నెలలుగా పేదలు గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారన్నారు. ఈ మధ్యకాలంలో అధిక వర్షాల వల్ల పై భాగంలో వుండే కనగానపల్లి చెరువుకు గండి పడడం వలన చెరువు నీరంతా పండమేరు వంక ద్వారా నీరు ఎక్కువగా రావడం వలన మా ప్రాంతమంతా నీట మునిగింది అన్నారు. ఇది గత ప్రభుత్వంలో ఇందిరమ్మకాలనీ, జగనన్న ఇండ్లు వంకకు 50 అడుగుల దూరంలో 300 ఇండ్లు ప్రభుత్వ అధికారులు నిర్మించడం జరిగిందని పేర్కొన్నారు. సర్వే.నెం. 194-8 వంక పరంబోకు కాదు, వంకకు 1000 అడుగుల దూరంలో ఉందని ఇది ఈ గ్రామకంఠ భూమి అని పేర్కొన్నారు.
ప్రభుత్వం ఇండ్లు లేని ఇరుపేదలకు 2 సెంట్ల స్థలము ఇండ్లు నిర్మించుకోవడానికి 4 లక్షల రూపాయలు చెల్లిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించడం జరిగిందన్నారు.
అనంతపురము రూరల్, ఉప్పరపల్లిపొలం 194-8 స్థలంలో నివాసముంటున్న అర్హులైన పేద ప్రజలకు హౌసింగ్ ద్వారా ఇండ్లు నిర్మించి పట్టాలు ఇవ్వవలసినదిగా కోరడం జరిగిందన్నారు. ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి సంతోష్ కుమార్ మాట్లాడుతూ… ఓట్ల కోసం పేదలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి రాగానే వారిని పట్టించుకోవడం లేదన్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నిరుపేదలు కు పట్టాలుకోసం ధర్నా చేస్తున్నారంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటువంటి న్యాయం జరగడం లేదని ప్రజలు తెలుసుకోవాలన్నారు. పేద ప్రజలకు పట్టాలిప్పించేంతవరకు అంచలంచలుగా ధర్నాలు నిర్వహిస్తామన్నారు. నగర సహాయ కార్యదర్శి బి.రమణ మాట్లాడుతూ… కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు, నిర్మాణానికి నాలుగు లక్షల ఇస్తామని వాగ్దానం చేయడం జరిగిందన్నారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలుగా వస్తున్న ఇప్పటివరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు అన్నారు. ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుంది అన్నారు. పేద ప్రజలకు పట్టాలు ఇచ్చేంతవరకు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం ఆర్డీవో జి కేశవ నాయుడు స్పందిస్తూ తాను స్వయంగా వచ్చి సర్వే నెంబర్లను పరిశీలిస్తానని ప్రభుత్వ భూమి అయితే తప్పకుండా పట్టాలు మంజూరు చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మైనారిటీ నగర ప్రధాన కార్యదర్శి ఖాజా హుస్సేన్, సిపిఐ మహిళా సమైక్య నాయకురాలు జయలక్ష్మి, వరలక్ష్మి, సిపిఐ నాయకులు కృష్ణుడు, జి రాజు, ఆర్ సుందర్ రాజు, ఎన్. జిలాన్ భాష, నాగప్ప, మునాఫ్ వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు