Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఅనారోగ్యముతో గృహిణి ఆత్మహత్య

అనారోగ్యముతో గృహిణి ఆత్మహత్య

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం ; పట్టణంలోని సంజయ్ నగర్ లో గల రాము భార్య బీరే లత అనారోగ్యంతోలలేక ఇంట్లో ఎవరూ లేని సమయాన ఉరివేసుకొని చనిపోయిందని వన్టౌన్ పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మృతురాలు లతా, రాము లు గత కొన్ని సంవత్సరాలుగా చేనేత కార్మికులుగా ఉంటూ కుటుంబాన్ని పోషించేవారు. వీరికి తిరుమలేశు అనే కుమారుడు, కనిక అనే కుమార్తె కలదు. గత కొన్ని నెలలుగా లతా కడుపునొప్పుతో బాధపడుతూ ఉండేదని, పలు ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా వైద్య చికిత్సలు అందించినా కూడా నయం కాకపోవడంతో, ఇలా ఆత్మహత్య చేసుకుంటుందని అనుకోలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తదుపరి వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు