- Advertisement -
వెనెజువెలా (Venezuela) రాజధాని కారకాస్ (Caracas)తో పాటు సమీపంలోని మిరాండా (Miranda), అరాగువా (Aragua), లా గైరా (La Guaira) రాష్ట్రాలలో ఈ రోజు (శనివారం) దాదాపు ఏడు చోట్ల భారీ పెలుళ్లు (Bomb blast) సంభవించాయి. యుద్ద విమానాలు చాలా తక్కువ ఎత్తులో ప్రయాణించి దాడులకు పావెల్పపడటంతో ప్రజలు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వెనుజువేలాలో నిర్వహిస్తున్న మాదక ద్రవ్యాల(Drugs) అక్రమ రవాణా అరికట్టడానికి ఆ దేశ భూభాగంపై దాడులు చేస్తామని తీవ్రంగా హెచ్చరించారు.


