Friday, March 6, 2026
Homeజిల్లాలుకర్నూలుపరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు

పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు

- Advertisement -

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : గ్రామంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటామని టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, సర్పంచ్ రామాంజనేయులు అన్నారు. శనివారం మండల కేంద్రమైన పెద్దకడబూరులో స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ సంక్రాంతి కార్యక్రమంలో భాగంగా ఎంపీడీఓ ప్రభావతి దేవి ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లే ప్రధాన రహదారి వెంబడి ఉన్న ముళ్ల కంపలను, డ్రైనేజీలలో ఉన్న పూడికను జేసీబితో శుభ్రం చేయించారు. అలాగే ఆదోని ప్రధాన రహదారిలో ఉన్న పెంటకుప్పలను తొలగించారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూసేందుకు కూటమి ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రజలు కూడా తమ చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల రోగాలు దరికి రావన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ అభివృద్ధి అధికారి సాయితేజ, సొసైటీ ఛైర్మన్ మీసేవ ఆంజనేయులు, టిడిపి మండల ఆర్గనైజింగ్ కార్యదర్శి గోనుమాను నరసన్న, నాయకులు బొగ్గుల నరసన్న తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు