Friday, March 6, 2026
Homeతెలంగాణమణికొండలో పగిలిన భారీ పైప్‌లైన్‌.. కాలనీల్లోకి పెద్ద ఎత్తున వరద

మణికొండలో పగిలిన భారీ పైప్‌లైన్‌.. కాలనీల్లోకి పెద్ద ఎత్తున వరద

- Advertisement -

హైదరాబాద్‌ నగరంలోని మణికొండలో భారీ పైప్‌లైన్‌ పగిలింది. దీంతో పలు కాలనీల్లోకి పెద్ద ఎత్తున వరద చేరింది. సింగూరు నుంచి హైదరాబాద్‌కు తాగునీటిని తీసుకువచ్చే పైప్ లైన్ మంగళవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో పగిలిపోయింది. దీంతో ఎంప్లాయిస్‌ కాలనీ, శివసాయి కాలనీల్లోకి పలు అపార్ట్‌మెంట్ల సెల్లార్లు వరదనీరు చేరింది. దీంతో కార్లు, ద్విచక్ర వాహనాలు మునిగిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక, హైడ్రా సిబ్బంది, మున్సిపల్ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో రోడ్డు మొత్తం ధ్వంసం కావడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. సమీపంలో ఉన్న పందెన్‌ వాగు ఉండటంతో చాలా వరకు వరదనీరు అందులోకి వెళ్లిపోయింది. లేదంటే మరిన్ని కాలనీలు నీటముగిపోయేవి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు