విశాలాంధ్ర – కొయ్యలగూడెం (ఏలూరు జిల్లా) : ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి స్వచ్ఛంద సేవా సంస్థల వారు, దాతలు ముందుకు రావాలని మానవతా సంస్థ సభ్యులు పేర్కొన్నారు. మండలంలో కన్నాపురం గ్రామ శివారు గుంజవరం గ్రామానికి చెందిన కొవ్వాసి జ్యోతి అనే మహిళ బోన్ క్యాన్సర్ వ్యాధితో ఇబ్బంది పడుతున్న ఆమెకు కొయ్యలగూడెం మానవతా సంస్థ ద్వారా 3500 రూపాయల నగదు వైద్య ఖర్చులు నిమిత్తం ఆమెకు అందజేశారు. వైద్య ఖర్చుల నిమిత్తం సహాయ సహకారాలు అంద చేయవలసిన వారు ఎవరైనా ఉంటే 8341577917 నెంబర్ కు కాల్ చేసి ఫోన్ పే చేయవలసిందిగా సంస్థ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ అధ్యక్షుడు మందపాటి. రామకృష్ణ, ఆగిరిపల్లి చంటిబాబు, బొమ్మ .మోహన్ రావు, చవ్వా .రాము, మట్టే .శ్రీను, యర్ర ఉమా తదితరులు పాల్గొన్నారు.


