Thursday, December 26, 2024
Homeజిల్లాలువిజయనగరంపేద, మధ్యతరగతి, కార్మిక, కర్షకులకి, బడుగు బలహీన వర్గాలకు అండగున్న సిపిఐ జెండాకు వందేళ్ళు

పేద, మధ్యతరగతి, కార్మిక, కర్షకులకి, బడుగు బలహీన వర్గాలకు అండగున్న సిపిఐ జెండాకు వందేళ్ళు

సిపిఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ
విశాలాంధ్ర -విజయనగరం టౌన్ : భారత కమ్యునిస్టు పార్టీ (సిపిఐ) శతాబ్ద కాలంగా పేద, బడుగు బలహీన వర్గాల ప్రజలకు, కార్మిక కర్షకులకు అండగా ఉంటూ అనేక పోరాటాలు చేసి ఎన్నో విజయాలు సాధించిన ఘనత సిపిఐ కి ఉందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ అన్నారు. గురువారం ఉదయం నగరంలో సిపిఐ జిల్లా కార్యాలయం డి.ఎన్. ఆర్ అమర్ భవన్ లో సిపిఐ శత వార్షికోత్సవం వేడుకలు జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ పార్టీ కార్యాలయం పైన సిపిఐ జెండాను ఎగురవేశారు. అనంతరం కేక్ కట్ చేసి నాయకులుకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ
బ్రిటిష్ పాలకుల నిర్బంధకాండకు, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా 1925 డిసెంబరు 26న కాన్పూర్ (ఉత్తరప్రదేశ్) గడ్డపై భారత కమ్యూనిస్టు పార్టీ ( సిపిఐ ) ఆవిర్భవించి గడిచిన 99 ఏళ్ళ కాలంలో ఎన్నో వీరోచిత పోరాటాలు, మహోన్నత త్యాగాలు, మహత్తర విజయాలకు సీపీఐ ప్రతీకగా నిలిచిందని అన్నారు.
బ్రిటిష్ సామ్రాజ్యవాదులు కమ్యూనిస్టులను అరెస్టు చేసి మీరట్ కుట్ర కేసుల్లాంటి అనేక తప్పుడు కేసులు బనాయించి దశాబ్దాల పాటు జైళ్ళలో పెట్టారన్నారు. స్వాతంత్య్ర్యం తరువాత ప్రధాన ప్రతిపక్షంగా పార్లమెంటులో పనిచేసింది. ఈ విప్లవాత్మక, సాహసోపేతమైన ప్రస్థానం ఇప్పుడు 100 వ సంవత్సరంలోకి అడుగుపెడుతోందన్నారు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న పార్టీ సిపిఐ పార్టీ అని ఆయన కొనియాడారు. దేశ స్వాతంత్రం కోసం అనేక పోరాటాలు చేసి ఎంతోమంది కమ్యూనిస్టు నాయకులు జైలుకెళ్లి జైలు జీవితం గడిపారని ఆయన అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో కమ్యూనిస్టు పార్టీ ఎన్నో పోరాటాలు చేసి ఆ పోరాటాలతోనే స్వాతంత్రం సాధించిందని అన్నారు. ఇప్పుడు అధికారం చాలా ఇస్తున్నా మతోన్మాద బిజెపి ఆనాడు ఏ ఉద్యమాలు చేయకుండా స్వాతంత్ర పోరాటంలో పాల్గొనకుండా ఇప్పుడు అధికారం అనుభవిస్తూ మత విద్వేషాలను రెచ్చగొడుతూ మతాల మధ్య చిచ్చుల పెడుతూ దేవుడి పేరుతో పబ్బం గడుపుకుంటూ కులాల పేరుతో గొడవలు పెడుతూ చోద్యం చూస్తుందని ఆయన విమర్శించారు. పార్లమెంట్ సాక్షిగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అవమానించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వెనకేసుకొస్తున్న ప్రధాన మోడీ వారి మనువాద రాజ్యాంగాన్ని తీసుకురావడానికి అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అంబేద్కర్ను అవమాన పరుస్తున్నారని ఆయన అన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మీద పార్లమెంట్ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి అమిత్ షా కి గుర్తులేదా అని ప్రశ్నించారు. ఆనాటి నుండి నేటి వరకు ఎర్రజెండా అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ పేద ప్రజలకు అండగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడంలో నిత్యం ప్రజా పోరాటంలో ఉండి, ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేసి ప్రజల పక్షాన నిలబడిన ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని ఆయన కొనియాడారు. ఈ 2024 డిసెంబర్ 26వ తేదీ నుంచి 2025 డిసెంబర్ 26 వరకు జిల్లా వ్యాపితంగా ఏడాది మొత్తం సిపిఐ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా జయప్రదం చేయాలని రమణ పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ రంగరాజు, నియోజకవర్గ నాయకులు అప్పరుబోతూ జగన్నాధం, ఎ.ఐ.ఎస్.ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎస్ సునీల్, మరియు పార్టీ కార్యకర్తలు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు