అమితాబ్ బచ్చన్‌కు ఏ శస్త్రచికిత్స జరగలేదని, ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని తెలియడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల ఆయన సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ తీవ్ర కలకలం రేపిన నేపథ్యంలో, బిగ్ బీ స్వయంగా స్పందించి ఆ వార్తలను ఖండించారు. ఇటీవల జరిగిన అర్జెంటీనా-స్పెయిన్ ఫిఫా మ్యాచ్‌ను ఉద్దేశించి, ఒక ఛాంపియన్ జట్టు ఓటమి నుంచి పుంజుకోవడం ఎంత కష్టమో వివరించేందుకు ఐసీయూ, సర్జరీ ఉదాహరణలను వాడినట్లు తెలిపారు. మెస్సీ పరిస్థితిని ఊహించుకుంటూ రాసిన ఆ పోస్ట్‌ను జనాలు తన వ్యక్తిగత ఆరోగ్యం గురించే అనుకుని తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు. తనకు ఎలాంటి ఆపరేషన్ జరగలేదని స్పష్టం చేసిన ఆయన, త్వరలోనే ఃకల్కిః సీక్వెల్ చిత్రీకరణలో పాల్గొనబోతున్నట్లు వెల్లడించారు. అమితాబ్ ఇచ్చిన వివరణతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
నాకు సర్జరీ జరగలేదు.. పూర్తి ఆరోగ్యంగా ఉన్నా: అమితాబ్ బచ్చన్
- Advertisement -
RELATED ARTICLES


