Homeతెలంగాణహైదరాబాద్‌లో కొవిడ్ కలకలం.. వైరస్ లక్షణాలతో ఆస్పత్రులకు బాధితులు!

హైదరాబాద్‌లో కొవిడ్ కలకలం.. వైరస్ లక్షణాలతో ఆస్పత్రులకు బాధితులు!

- Advertisement -

దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం, పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే నలుగురు మృత్యువాత పడటంతో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. హైదరాబాద్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు గత నెల రోజులుగా తీవ్రమైన జలుబు, జ్వరం, దగ్గు, ఒళ్లునొప్పుల లక్షణాలతో వస్తున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. అయితే, బాధితులకు కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయకపోవడంతో ఈ కేసులు బయటకు రావడం లేదు. ఫలితంగా తెలంగాణలో కరోనా కేసులు ‘సున్నా్ణ అని అధికారిక వర్గాలు చూపుతున్నాయి. ఇటీవల తార్నాకకు చెందిన ఒక మహిళ ఊపిరితిత్తులు దెబ్బతిని మరణించడం, గాంధీ ఆస్పత్రిలో ఒక కేసు నమోదవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ, ప్రజారోగ్య విభాగం నుంచి ఎలాంటి హెచ్చరికలు గానీ, పరీక్షల ఆదేశాలు గానీ జారీ కాకపోవడం గమనార్హం. నాలుగేళ్లుగా కిట్లు, మాస్కులు, శానిటైజర్ల కొనుగోలును నిలిపివేయడంతో ఆస్పత్రుల్లో తీవ్ర కొరత ఏర్పడింది. ఐసీఎంఆర్ నివేదికల ప్రకారం జూన్ నుంచి దేశంలో కొవిడ్ కేసులు పెరుగుతున్నట్లు స్పష్టమవుతున్నా, రాష్ట్రంలో వ్యాధుల తీవ్రతను పర్యవేక్షించాల్సిన ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (ఐడీఎస్‌పీ) నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు