Homeఆంధ్రప్రదేశ్విరాట్ భాయ్ కి రుణపడి ఉంటా: సింధు

విరాట్ భాయ్ కి రుణపడి ఉంటా: సింధు

- Advertisement -


క్రీడలు: ఒక ఆలోచన మనిషి గమ్యాన్ని మారుస్తుంది. ఒక సలహా మనిషికి ధౌర్యానిస్తుంది. స్వాంతన కలిగించి, ఆత్మ స్థైర్యాన్ని ఇస్తుంది. ఒక మంచి మనిషి, స్నేహితుడు నుంచి ఇవి లభిస్తాయి. అందుకు ఉదాహరణే స్టార్ షట్లర్ పీవీ సింధు జపాన్ ఓపెన్ టెన్నిస్ విజయగాధ. స్నేహితుని సలహా ఎలా ఉపయోగపడిందో సింధు మాటాల్లోనే తెలుసుకుందాం…‘నేను విరాట్ భాయ్ కి ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఆయన చేసిన మేలు మేము ఎన్నటికీ మర్చిపోలేం. నా కెరీర్ క్లిష్టమైన దశలో ఉన్నప్పుడు నేను కోహ్లీని సంప్రదించాను. వరుస గాయాలు, ఆశించిన ఫలితాలు రాకపోవడంతో సతమతమవుతున్న సమయంలో నన్ను అర్థం చేసుకునే వ్యక్తి, సలహా అవసరమయ్యాయి. కోహ్లీని సంప్రదించగా నిమిషాల వ్యవధిలోనే స్పందించారు. మరుసటి రోజే మేము కలుసుకున్నాం. ఆయన ఇచ్చిన సలహాలు నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఆయన చెప్పిన మాటలు నాకు, నా భర్త దత్తాకూ బాగా గుర్తుండిపోయాయి. కొన్ని సంభాషణలు మన ఆలోచనా తీరునే మార్చేస్తాయి. అటువంటి వాటిలో ఇదొకటి’ అని సింధు వివరించింది. సింధు ఇటీవల జపాన్ ఓపెన్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీకి ముందు రెండేళ్లపాటు సింధు కెరీర్ పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. బరిలోకి దిగిన ప్రతి టోర్నీలోనూ ఒకటి, రెండు రౌండ్లలోనే ఇంటిముఖం పట్టింది. గాయాలు కూడా ఆమెను వెంటాడాయి. ఫామ్ పడిపోయి…2028 ఒలింపిక్స్‌ వరకూ కొనసాగుతుందా అన్న సందేహాలు కలుగుతున్న సమయంలో… తనలో ఛాంపియన్ ఆట ఇంకా ఉందని చాటుతూ ఈ తెలుగు తేజం జపాన్ ఓపెన్లో చరిత్రాత్మక విజయాన్ని అందుకుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు