విశాలాంధ్ర -ధర్మవరం : వక్ఫ్ బోర్డు నూతన సవరణ చట్టమును రద్దు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ముస్లిం కమిటీల సోదరులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆయుఫ్ ఖాన్ అధ్యక్షతన ధర్మవరం జామియా మసీదు, మదీనా మసీదు, అంజుమాన్ కమిటీల ఆధ్వర్యంలో, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆదేశాల మేరకు ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ ర్యాలీలో సంయుక్త ముస్లిం కమిటీల సోదరులు హిందువులు క్రిస్టియన్ సోదరుల మద్దతుతో గత తొమ్మిది రోజుల రిలే నిరాహార దీక్షలు అనంతరం ఈ ర్యాలీని నిర్వహించడం జరిగిందని తెలిపారు. అనంతరం ఆర్డీవో మహేష్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు, షేకు మెసేజ్, గ్రేస్,య్యా, సుందర్ సింగ్, మౌలానా అబుతాహీర్, తయోబ్, అభూతురాబ్, సిపిఐ, సిపిఎం, వైఎస్సార్సీపి నాయకులు, సిఐటియు, ఏఐటియుసి, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఎమ్మార్పీఎస్, బహుజన సమాజ్ పార్టీ, పలు పార్టీల నాయకులు ఈ ర్యాలీలో పాల్గొని జయప్రదం చేశారు.
వక్ఫ్ బోర్డు నూతన సవరణ చట్టాన్ని రద్దు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.. ముస్లిం కమిటీల సోదరులు
RELATED ARTICLES