Homeజిల్లాలుశ్రీ సత్యసాయియదేచ్చగా అక్రమ కలప దందా..చోద్యం చూస్తున్న అధికారులు…

యదేచ్చగా అక్రమ కలప దందా..చోద్యం చూస్తున్న అధికారులు…

- Advertisement -

విశాలాంధ్ర: చిలమత్తూరు,…మండల వ్యాప్తంగా 12 పంచాయితీలలో చింత వేప కానుగ తదితర వృక్షాలు పంట పొలాలలో గుట్టలలో వనములలో గ్రామాలలో ఏపుగా పెరిగిన చెట్లను నేల కూలుస్తున్నారు, యదేచ్చగా అక్రమ కలప దందా అక్రమార్కులు చేసుకుంటూ వ్యాపారమే ధ్యేయంగా పెట్టుకొని పచ్చని చెట్లు నరికి దందా సాగిస్తున్నారు, ఈతంగంపై అటవీ శాఖ అధికారులకు తెలిసిన ను చూసి చూడనట్లు వ్యవహరిస్తూ చోద్యం చూస్తున్నారని మండల ప్రజలు వాపోతున్నారు, రైతులకు బురిడీ మాటలు చెప్పి అతి తక్కువ ధరలకే వృక్షాలను కొనుగోలు చేసి వాటిని నేలకూల్చి వారికి అనువైన సమయాన్ని చూసుకొని వాహనాల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తూ క్వింటాళ్లు చొప్పున అమ్ముకుంటున్నారు, ఈ చెట్లు నరికివేత పై అధికారుల నియంత్రణ లేకపోవడంతో విచ్చలవిడిగా అక్రమార్కులు రెచ్చిపోయి చెట్లను నేల కూల్చి అధిక ధరలకు విక్రయిస్తూ అందిన కాటికి దండుకుంటున్నారు, దీంతో ప్రకృతి నాశనమైపోయి సకాలంలో వర్షాలు పడక అతివృష్టి అనావృష్టి కి దాపురిస్తుందని మేధావులు చర్చించుకుంటున్నారు, అధికారుల అలసత్వంతో దళారులకు వరంగా మారిందని కలప దొరికిన కాటికి పరిశ్రమలకు, కర్ణాటక రాష్ట్రానికి తెగ నమ్ముకుంటూ అక్రమార్కులు యదేచ్చగా వ్యాపారాలు కొనసాగిస్తున్నారనే సమాచారం. అక్రమార్కులు వాల్టా చట్టానికి తూట్లు పొడిచి పర్యాటకులను అలరించే సైబీరియన్ పక్షులు సంచరించే ప్రదేశాలలో సైతం చెట్లను నరికి సొమ్ము చేసుకుంటున్నా అధికారులు పట్టించుకోలేదని విశ్వసినీయ సమాచారం, అక్రమ కలప రవాణా అటవీ శాఖ అధికారుల కను సన్నలలో జరుగుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి, అధికారులు కలప వ్యాపారస్తులతో చేతులు కలపడంతో వారి సంపాదన మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుందని ప్రచారం వినబడుతుంది, ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులకు అనుమానం రాకుండా అప్పుడప్పుడు తుతూ మంత్రముగా దాడులు నిర్వహించి కేసులు కట్టి అపరాధ రుసుము కట్టించుకొని మమ అనిపిస్తున్నారని ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి, ఇది ఇలాగే కొనసాగితే వృక్షజాతి అంతమై పర్యావరణంలో మార్పులు వచ్చి ప్రకృతి విలయం సంభవిస్తుందని మేధావులు చర్చించుకుంటున్నారు, ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రకృతిని కాపాడే ప్రయత్నాలు చేస్తారో లేదో మరి వేచి చూడాల్సిందే.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు