- Advertisement -
విశాలాంధ్ర – తాళ్లపూడి : తాళ్లపూడి మండలం అన్నదేవరపేట లో పై కప్పు పాడైపోయి ఏ క్షణాన్నైనా ప్రమాదం జరిగిన ఆశ్చర్యపోనవసరం లేదు అనుకునే స్థితి లో ఉన్న ఓ ఇంటిని అధికారులు గుర్తించారు. తుఫాన్ నేపధ్యం లో ప్రమాదం బారిన పడకుండా ఉండేందుకు ముందస్తుగా ఆ ఇంటి లో ఉంటున్న ఒంటరి మహిళల ను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని వి.ఆర్.ఓ నాగేశ్వరరావు భావించి, ఆ మహిళలను ఇంటి నుండి బయటకు రావాలని కోరారు. మంచం మీదే అనారోగ్యం తో ఉన్న నూనె లక్ష్మీ ని, ఆమె సహాయకురాలిని ఎంత కోరినా బయటకు రాకపోవటం తో అధికారులు తల పట్టు కుంటున్నారు.


