Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఆకట్టుకున్న నృత్య కార్యక్రమం

ఆకట్టుకున్న నృత్య కార్యక్రమం

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని శివాలయములో గల ఐదవ సచివాలయం పార్కులో పురపాలక సంఘం పరిధిలో హ్యాపీ సండే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తమ వంతుగా పట్టణంలోని ఎస్బిఐ కాలనీ మానస నృత్య కళా కేంద్రం గురువు మానస వారి శిష్య బృందంతే నృత్య కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. మానస శిష్య బృందం నిర్వహించిన భరతనాట్యం, జానపద గేయాల నృత్యం అందరినీ ఆకట్టుకుంది. తదుపరి మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య గురువు మానస తో పాటు శిష్య బృందాన్ని ఘనంగా సత్కరిస్తూ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిపిఓ భాస్కర రాయల్, సచివాలయ సిబ్బంది, మానస తల్లిదండ్రులు, శిష్య బృందం తల్లిదండ్రులు పురపాలక సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు