Homeఅంతర్జాతీయంమా ఆర్థిక వ్యవస్థను స్విచ్చాఫ్‌ చేసుకోవాలా..?

మా ఆర్థిక వ్యవస్థను స్విచ్చాఫ్‌ చేసుకోవాలా..?

- Advertisement -

: రష్యా చమురు కొనుగోలు విషయంలో పశ్చిమ దేశాలపై భారత్‌ మండిపాటు

ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యాపై పశ్చిమ దేశాలు పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఆంక్షలు ఉన్నప్పటికీ మాస్కో నుంచి భారత్‌ పెద్ద ఎత్తున చమురు దిగుమతి చేసుకుంటోంది.
ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యాపై పశ్చిమ దేశాలు పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఆంక్షలు ఉన్నప్పటికీ మాస్కో నుంచి భారత్‌ పెద్ద ఎత్తున చమురు దిగుమతి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో రష్యా చమురు దిగుమతి చేసుకోవడంపై పశ్చిమ దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్నాయి. దీనిపై తాజాగా భారత్‌ స్పందించింది. పశ్చిమ దేశాల విమర్శలను యూకేలోని భారత హైకమిషనర్‌ విక్రమ్‌ దొరైస్వామి తోసిపుచ్చారు. ఏ దేశం కూడా తమ ఆర్థిక వ్యవస్థను ఆపేయాలని అనుకోదని వ్యాఖ్యానించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు