Homeజిల్లాలుఅనకాపల్లిఇంటర్ ప్రథమ సంవత్సరం క్వాలిఫై పరీక్షలు

ఇంటర్ ప్రథమ సంవత్సరం క్వాలిఫై పరీక్షలు

- Advertisement -

విశాలాంధ్ర – రోలుగుంట: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ఆదేశాల మేరకు (IPE-2026)లో భాగంగా ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు క్వాలిఫై పరీక్షలు నిర్వహించనున్నట్లు రోలుగుంట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఎం.అప్పలరాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21వ తేదీ బుధవారం నైతికత – మానవీయ విలువలు, 23వ తేదీ శుక్రవారం పర్యావరణ విద్య పరీక్షలను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కళాశాల ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ రెండు పరీక్షలు క్వాలిఫై పరీక్షలుగా నిర్ణయించబడినందున ప్రతి ప్రథమ సంవత్సరం విద్యార్థి తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు. పరీక్షలకు హాజరుకాని విద్యార్థులకు ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికెట్ మంజూరు చేయబడదని స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు