విశాలాంధ్ర- పెనుమంట్ర:పశ్చిమ గోదావరి జిల్లా ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఆర్యవైశ్యుల వాసవి పెనుగొండలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర పండుగగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి నిమ్మల మాట్లాడుతూ ధర్మం కోసం నిలిచిన వాసవి మాత అమరత్వానికి ప్రతీక అని అన్నారు. కార్యక్రమంలో స్టేట్ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ పరేపల్లి రాకేష్, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. కేరళ, కర్ణాటక,కోయంబత్తూర్, బెంగళూరు తదితర రాష్ట్రాల నుంచి విచ్చేసిన వాసవి మల దారులు, భక్తులు అమ్మవారిని దర్శించుకుని తమ మ్రొక్కులు చెల్లించుకున్నారు..
అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి
- Advertisement -
RELATED ARTICLES


