Homeజిల్లాలుశ్రీ సత్యసాయియోగి వేమన బోధనలు నేటి సమాజానికి ఎంతో అవసరం

యోగి వేమన బోధనలు నేటి సమాజానికి ఎంతో అవసరం

- Advertisement -

ఎంపీడీవో సాయి మనోహర్
విశాలాంధ్ర ధర్మవరం;; యోగివేమన బోధనలు నేటి సమాజానికి ఎంతో అవసరమని ఎంపీడీవో సాయి మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో యోగివేమన జయంతి వేడుకలను కార్యాలయ అధికారులు, సిబ్బంది నడుమ ఘనంగా నిర్వహించుకున్నారు. తదుపరి ఎంపీడీవో సాయి మనోహర్ యోగివేమన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ యోగి వేమన తన పద్యాల ద్వారా సమానత్వం, సత్యం, నైతికత, మానవ విలువలు వంటి అంశాలను ప్రజలలో నాటిన మహనీయుడని అన్నారు. కుల, మత, వర్గ భేదాలకు అతీతంగా సమాజ సంస్కరణకు తన సాహిత్యాన్ని ఆయుధంగా మలిచిన యోగి వేమన బోధనలు నేటి సమాజానికి కూడా ఎంతో ప్రాసంగికమని పేర్కొన్నారు. యోగివేమన ఆదర్శాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టి, నిజాయితీతో కూడిన పరిపాలనకు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పరిపాలన అధికారి, డిప్యూటీ మండల పరిషత్ అభివృద్ధి అధికారి , సర్పంచులు, సి వి ఏ పి సిబ్బంది, ఏపీవో, వి బి జి రామ్, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, మండల జి ఎస్ డబ్ల్యూ ఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు