ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని కే. హెచ్.ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల నడుమ ప్రజాకవి వేమన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని ప్రిన్సిపాల్ డాక్టర్. కె .ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలుగు శాఖాధిపతి డా. ఎస్. షమీఉల్లా ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది అన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ మహాకవి వేమన సత్యాన్వేషి. దార్శనికుడు అని అన్నారు. చిన్న చిన్న ఆటవెలది పద్యాల ద్వారా పేరుకు పోయిన మూఢ నమ్మకాలు, మూఢ విశ్వాసాల నుండి సమాజాన్ని ప్రక్షాళనం చేయడానికి ప్రయత్నించిన సంఘసంస్కర్త. హేతువాది అని తెలిపారు. వారి సిద్ధాంతాలు , ఆయన తాత్వికత ఈనాటి సమాజానికి, విద్యార్థి లోకానికి మార్గదర్శకం అని తెలిపారు. ప్రజల భాషలో ఆటవెలది పద్యాలలో అనేక విషయాలు చెప్పిమెప్పించిన మహాకవి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డా ఎస్. చిట్టెమ్మ,డా. ఎస్ త్రివేణి, డా. ఎస్. షమీఉల్లా, డా ఎస్.గోపాల్ నాయక్. ఎ. కిరణ్ కుమార్. ఎస్ పావని, యం భువనేశ్వరి యం. పుష్పావతి , యం సరస్వతి, జి .మీనా, జి .ధనుంజయ, బి. అనంద్ తదితర… అధ్యాపక అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు.
ఘనంగా ప్రజాకవి వేమన జయంతి వేడుకలు..
- Advertisement -
RELATED ARTICLES


