విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం పట్టణంలోని ఆర్ డి టి క్రికెట్ మైదానంలో గత వారం రోజులుగా జరుగుతున్న పి.శ్రీనివాసులు స్మారక అండర్-12 బాలుర క్రికెట్ టోర్నమెంట్ ఆదివారంతో పూర్తి అయింది. అనంతరం ఆర్డిటి కోచ్ రాజశేఖర్ మాట్లాడుతూ ఆర్డిటి ధర్మవరం జట్టు ఎంసీ ఏ గొట్లూరు జట్టు మధ్య జరిగిన ఫైనల్స్, టాస్ గెలిచిన అడిటి ధర్మవరం జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఆర్డీటీ ధర్మవరం జట్టు 25 ఓవర్లలో 186/4 పరుగులు చేసింది. ఆర్‌డిటి ధర్మవరం జట్టు బ్యాట్స్‌మెన్ బి. బద్రీనాథ్ 46 బంతుల్లో 83 పరుగులు, పి. వేద వ్యాసు 37 బంతుల్లో 42 పరుగులు, ఎంసిఎ గోట్లూరు జట్టు బౌలర్లు ఎస్ సాథ్విక్ 3 వికెట్లు పడగొట్టారు.187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి దిగిన ఎంసీఏ జట్టు 13.3 ఓవర్లలో 51 పరుగులకే ఆలౌట్ అయింది. ఆర్డీటీ ధర్మవరం జట్టు కెప్టెన్ రాజా 5 వికెట్లు, సిద్ధార్థ్ 3 వికెట్లు పడగొట్టారు. ఆర్డిటి ఫైనల్స్‌లో ధర్మవరం జట్టు 135 పరుగుల తేడాతో గెలిచి ట్రోఫీని ఎగురవేసింది.టోర్నమెంట్‌లో ఉత్తమ బ్యాటర్ , ఆటగాడు: బి బద్రీనాథ్ కాగా,టోర్నమెంట్‌లో ఉత్తమ బౌలర్: ఎం రాజా కాగా,రన్నరప్: ఎంసీఏ గొట్లూరు కావడం జరిగింది. విజేత గా ఆడిటి ధర్మవరం జట్టు కావడం జరిగింది. ముఖ్య అతిథులుగా ట్రోఫీ స్పాన్సర్: జి ఎల్ ఎన్ స్వీట్స్ షాప్ యజమాని టోర్నమెంట్ నిర్వహించినందుకు అనంతపురం జిల్లా క్రికెట్ అసోసియేషన్ వారు ఆర్ డి టి ప్రశంసించారు. టీడీపీ నేత సంధా రాఘవ మిత్రబృందం నుండి జింకా పురుషోత్తం టోర్నమెంట్ ముగింపు వేడుకలో కూడాపాల్గొన్నారు.టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ఆర్డిటి ధర్మవరం ఏరియా ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్రీనివాసులు , పేరెంట్స్ కూడా పాల్గొన్నారు.
ఉత్సాహభరితంగా సాగిన క్రికెట్ మ్యాచ్
- Advertisement -
RELATED ARTICLES


