విశాలాంధ్ర – తాళ్లపూడి : కౌమార్ దశలోకి వచ్చిన బాలికలు పాటించాల్సిన జాగ్రత్తలు గురించి, సమాజంలో బాలికల, మహిళల పట్ల జరుగుతున్న దారుణాల కు గురి కాకుండా జాగ్రత్తలు వహించాలని అంగన్వాడీ సూపర్ వైజర్ భాగ్యకుమారి తెలిపారు. అంతర్ జాతీయ బాలిక దినోత్సవం సందర్భన్గా ఐ.సి.డి.ఎస్ అద్వర్యం లో హైస్కూల్ స్థాయిలో బాలికలు తో సమావేశాన్ని నిర్వహించారు. బాలికల విద్య, బాల్య వివాహాలు నిర్ములన పై ఆత్మ రక్షణ విధానాలపై అవగాహన కలిపించారు. ప్రతి బాలిక తప్పకుండ డిగ్రీ వరకు చదవాలని తెలిపారు. సేవ్ చైల్డ్, సేవ్ వరల్డ్ అని నినాధాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. పలు హైస్కూల్స్ వద్ద ఈ కార్యక్రమాలు సాగించారు. అంగన్వాడీ సిబ్బంది, హై స్కూల్ ఉపాధ్యాయిని లు పాల్గొన్నారు.
అంతర్జాతీయ బాలికల దినోత్సవం
- Advertisement -
RELATED ARTICLES


