విశాలాంధ్ర – దేవరపల్లి: దేవరపల్లి బాలదుర్గమ్మ ఆలయంలో దేవి నవరాత్రులు ఉత్సవాలు ముగింపు అనంతరం శుక్రవారం నాడు భారీ స్థాయిలో అన్న సమారాధన జరిగింది . ఉదయం బాలదుర్గమ్మ అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు అభిషేకాలు నిర్వహించారు ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం 11 గంటలకు దేవరపల్లి ఎంపీపీ కేవీకే దుర్గారావు అన్న ప్రసాదం కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా బాలదుర్గమ్మ ఆలయం కమిటీ చైర్మన్ పైడికొండల సత్యనారాయణ కోశాధికారి కామిశెట్టి దుర్గారావు మాట్లాడుతూ దేవి నవరాత్రులు ఉత్సవాలు అనంతరం దాతల సహకారంతో అన్న సమారాధన ఏర్పాటు చేశామని తెలిపారు దేవరపల్లి దుద్దుకూరు బందపురం లక్ష్మీపురం పల్లంట్ల రామన్నపాలెం కృష్ణపాలెం ధూమంతునిగూడెం కొత్తగూడెం గ్రామాల నుండి అధిక సంఖ్యలో బాలదుర్గమ్మ ఆలయ వద్ద అన్న ప్రసాదం స్వీకరించారు ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ పైడికొండల సత్యనారాయణ కోశాధికారి కామిశెట్టి దుర్గారావు కమిటీ సభ్యులు గారపాటి అప్పారావు పైడికొండల శివయ్య కామిశెట్టి ధర్మరాజు పైడికొండల వెంకటేశ్వరరావు జాజిమొగ్గలా ప్రభాకరరావు రౌతు అప్పారావు పైడికొండల శివయ్య కామిశెట్టి మంగ మాతు సీత పిన్నమనే వెంకటకృష్ణ భక్తులు మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆలయ అభివృద్ధి కమిటీ భక్తులకు అన్ని ఏర్పాట్లు ఏర్పాటు చేసింది
దేవీ నవరాత్రులు ముగింపులో అన్న సమారాధన
- Advertisement -
RELATED ARTICLES


