విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరులో శనివారం రాష్ట్రోపాద్యాయ సంఘం 2025 క్యాలెండరు, డైరీలను మండల విద్యాధికారులు సువర్ణల సునియం, రామ్మూర్తి లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్టీయు రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎస్టీయు డైరీలో ఉపాధ్యాయుల సర్వీసుకు సంబంధించిన అన్ని రకాల ప్రభుత్వ ఉత్తర్వులు, సెలవుల నిబంధనలు, పెన్షన్ నియమాలు సమగ్రంగా ఉన్నాయని తెలిపారు. డైరీ ఉపాధ్యాయులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయు మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తులసిరాం, లక్ష్మణ్ , ఎస్టీయు నాయకులు ఈరన్న, బీరప్ప, షబ్బీర్, ఇమ్రాన్, నీలోఫర్ తదితరులు పాల్గొన్నారు.