విశాలాంధ్ర – రాజేంద్రనగర్ రాజేంద్రనగర్ జలమండలి కార్యాలయంలో ఏటీఓ సీబీ డబ్ల్యుఎస్ గా విధులు నిర్వహిస్తున్న సయ్యద్ అక్తర్ అలీ జలమండలి కార్యాలయంలో చేస్తున్న అవినీతి కార్యకలాపాలపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. పీడీపీ చౌరస్తా లో ఉన్న అర్మాన్ హోటల్ కు అనుమతులు లేకుండ నల్లా కనెక్షన్ తీసుకున్నారని, దాన్ని పరిశీలించిన సయ్యద్ అక్తర్ అలీ చర్యలు తీసుకోకుండ రూ. 3లక్షలు లంచంగా తీసుకున్నారని జలమండలి ప్రధాన కార్యాలయం కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు అందింది. అక్రమ నల్లా కనెక్షన్ కు సంబందించి ఫోటోలు కూడా పంపించారు. స్పందించిన జలమండలి ఉన్నతాధికారులు గత శనివారం విజిలెన్స్ అధికారులతో విచారణ జరిపించినట్లు తెలిసింది. అది నిజం కావడంతో రాజేంద్రనగర్, అత్తాపూర్ సర్కిళ్లలో జలమండలి ఏటీఓ గా పనిచేస్తున్న సయ్యద్ అక్తర్ అలీపై విచారణ జరుపాలని బుధవారం రాజేంద్రనగర్ జలమండలి జనరల్ మేనేజరు కార్యాలయానికి ఖైరతాబాద్ లోని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ కార్యాలయం నుంచి లేఖ మెమో నెం 213250/ పిఅండ్ /బీ3/2026/5466 వచ్చింది. లేఖ అందుకున్న రాజేంద్రనగర్ జలమండలి అధికారులు సయ్యద్ అక్తర్ అలీ పై విచారణ చేపట్టడానికి సిద్దమౌతున్నారు.


