Homeతెలంగాణఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

- Advertisement -

విశాలాంధ్ర-కొందుర్గ్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గ్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో షాద్‌నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. కన్వెన్షన్ హాల్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ…. ప్రజలకు ఉపయోగపడేలా అన్ని సౌకర్యాలతో కన్వెన్షన్ హాళ్లను ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని, ఇలాంటి వసతులు శుభకార్యాలు, వివిధ సామాజిక కార్యక్రమాల నిర్వహణకు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సూచన కృష్ణారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ అనిత జితేందర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సాదిక్, మాజీ పీఏసీఎస్ చైర్మన్ దామోదర్ రెడ్డి, సర్పంచులు ఆంజనేయులు, అమర్నాథ్ రెడ్డి, నర్సింహులు, జంగయ్య, రాజ్ కుమార్, శ్రీకాంత్, మాజీ ఎంపీటీసీ అంజిరెడ్డి, మల్లేష్ గౌడ్, లాలపేట మధుసూదన్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నరసింహ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు