సిపిఐ కాలనీలో సీసీ రోడ్లు, మౌలిక వసతులు కల్పించాలి…
విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : మండల కేంద్రాల్లోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన గ్రామసభలో సిపిఐ నాయకులు కాలనీల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా సిపిఐ కాలనీలో సీసీ రోడ్లు లేకపోవడం, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల కొరతపై ఆందోళన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి సాకే గంగాధర్ మాట్లాడుతూ, కాలనీలో కనీస వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తక్షణమే సీసీ రోడ్లు నిర్మించి, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పలుమార్లు వినతులు ఇచ్చినప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదని విమర్శించారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ గ్రామసభలో మండల సహాయ కార్యదర్శి చాపల రామాంజనేయులు, సుధాకర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు సూర్యనారాయణ, నారాయణప్ప తదితరులు పాల్గొన్నారు. గ్రామసభలో వచ్చిన వినతులను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చినట్లు తెలిపారు.


