Wednesday, April 2, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిప్రభుత్వ భూముల సంరక్షణ మా బాధ్యత

ప్రభుత్వ భూముల సంరక్షణ మా బాధ్యత

ఆర్డీవో మహేష్
విశాలాంధ్ర ధర్మవరం : డివిజన్ పరిధిలోని ప్రభుత్వము యొక్క భూములను సంరక్షించుటయే మా బాధ్యత అని ఆర్డిఓ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవలే డివిజన్ పరిధిలో ప్రభుత్వ భూముల ఆక్రమణ విషయంలో అత్యవసర సమావేశాన్ని కూడా నిర్వహించడం జరిగిందని, పలు రకాల విషయాలను డివిజన్ పరిధిలోని వివిధ ప్రభుత్వ అధికారుల కు సమాచారాన్ని తెలియజేయడం జరిగిందని తెలిపారు. తొలుత గ్రామ టాస్క్ ఫోర్స్ కమిటీని, తదుపరి మండల స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీని, డివిజన్ స్థాయి టాస్క్ పోర్ట్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని. ఈ కమిటీల వల్ల ఎప్పటికప్పుడు ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురి అయ్యాయా? లేదా ?అన్న విషయాలను వెంటనే తెలుసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఒకవేళ ఆక్రమణకు గురి అయితే చట్టం ప్రకారం ఆక్రమణదారులపై కఠిన చర్యలు గైకొని కేసులు కూడా నమోదు చేస్తామని తెలిపారు. ఇప్పటికే డివిజన్ స్థాయిలో రీ సర్వే కూడా విజయవంతంగా నడుస్తోందని వారు తెలిపారు. ప్రభుత్వ భూముల ఆక్రమణ విషయంలో అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, సమాంతరంగా అన్ని అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ టాస్క్ ఫోర్స్ బృందాలను మరింత ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. టాస్క్ ఫోర్స్ బృందాల ఏర్పాటుతో ప్రభుత్వ భూములు మరింత సంరక్షణలో ఉంటూ భద్రత కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. భూముల రక్షణకు సంబంధించిన సమగ్ర ప్రణాళికలు కూడా రూపొందించడం జరిగిందని తెలిపారు. ఎక్కడైనా సరే, ఏ సమయములోనైనా ఆక్రమణ జరిగింది అన్న విషయం తెలిస్తే యుద్ధ ప్రాతిపతకాన చర్యలు గైకొనబడతాయని తెలిపారు. కావున గ్రామ మండల ప్రజలు కూడా ప్రభుత్వ భూముల సంరక్షణపై భాగస్వాములు కావాలని, తద్వారా ఎక్కడైనా ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురి అయినట్లయితే గ్రామ టాస్క్ఫోర్స్ మండల టాస్క్ ఫోర్స్, డివిజన్ టాస్క్ ఫోర్స్ కు వెంటనే సమాచారం అందించాలని వారు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు